: రాత్రివేళ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా..? జాగ్రత్త!
స్మార్ట్ ఫోన్ ను వాడని వారు నేడు అరుదే. ముఖ్యంగా యువతరం చేతుల్లో స్మార్ట్ ఫోన్ సరిగమలు పలకాల్సిందే. అయితే, మీకు స్మార్ట్ ఫోన్ ఉంటే గనుక రాత్రి 9 గంటల తర్వాత వాడేటప్పుడు జాగ్రత్త! ఎందుకంటే రాత్రి 9 తర్వాత వాడితే దాని ప్రభావం మరుసటి రోజు మీ ఉద్యోగ విధులపై ప్రభావం చూపుతుందట. పనిలో ఉత్పాదకత, నైపుణ్యం తగ్గిపోతాయని అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త క్రిస్టోఫర్ అంటున్నారు. ఈ విషయం ఆయన బృందం నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైందట.