: ముందస్తు బెయిల్ దాఖలు చేసిన మైఖేల్ ఫెరీరా
ప్రపంచ మాజీ బిలియర్డ్స్ ఛాంపియన్ మైఖేల్ ఫెరీరా నిన్న ముంబైలోని స్థానిక కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు ఆయన అధికార ప్రతినిధి తెలిపారు. బహుళస్థాయి మార్కెటింగ్ సంస్థ 'క్యునెట్' లో రూ.425 కోట్ల స్కామ్ లో ఆయనకు వాటాలు ఉన్నట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దాంతో, కొన్ని నెలల నుంచి ముంబై పోలీసులు ఆయనను విచారిస్తున్నారు. అయితే, ఓసారి గైర్హాజరవడంతో పోలీసులు ఆయనపై జనవరి 2న లుకవుట్ నోటీసులు జారీ చేశారు.