: శ్రీవారి సేవలో షిండే


కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామిలో సేవలో పాల్గొన్నారు. షిండేకు టీటీడీ చైర్మన్ బాపిరాజు, ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం స్వాగతం పలికారు. స్వామి దర్శనం అనంతరం షిండేను అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. షిండే తిరుమలకు శనివారమే చేరుకుని ఒకసారి దర్శనం పూర్తి చేసుకోగా, ఈ ఉదయం మరోసారి శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News