: కేరళ సీపీఐ(ఎం)నేత హత్య కేసులో దోషుల గుర్తింపు
కేరళలో సంచలనం సృష్టించిన సీపీఐ(ఎం) నేత టీపీ చంద్రశేఖరన్ హత్య కేసులో పన్నెండు మందిని ప్రత్యేక కోర్టు దోషులుగా వెల్లడించింది. ఇందులో ఓ గ్యాంగ్ లో ఉన్న తొమ్మిది మంది వ్యక్తులు, ముగ్గురు స్థానిక సీపీఐ(ఎం) నేతలపై వచ్చిన తీవ్ర ఆరోపణలు రుజువయ్యాయి. ఈ మేరకు తిరువనంతపురంలోని అడిషనల్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి ఆర్ నారాయణన్ వెల్లడించారు. అయితే, కోర్టు వీరికి శిక్షను రేపు విధించనుంది.