: అక్కినేని అరుదైన నటుడు: నటశేఖర కృష్ణ
అక్కినేని నాగేశ్వరరావు మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని నటశేఖర కృష్ణ అన్నారు. హైదరాబాద్ లోని అన్నపూర్ణా స్టూడియోస్ లో అక్కినేని పార్థివదేహాన్ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, తొలితరం నటవర్గం నుంచి మూడవ తరం నటీనటుల వరకు వారథిగా, ఆదర్శంగా, స్పూర్తిమంతంగా అక్కినేని నిలిచారని కొనియాడారు. సినీపరిశ్రమలో విరామమెరుగకుండా పని చేసిన అక్కినేని మహనీయుడని అన్నారు. ఆయనతో కలసి పని చేసిన అదృష్టం తనకు కలిగిందని, తామిద్దరం కలసి చాలా సినిమాల్లో పనిచేశామని ఆయన గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఒక ధ్రువతార ఆకాశానికెగసిపోవడం బాధ కలిగిస్తోందని సూపర్ స్టార్ కృష్ణ తెలిపారు. అక్కినేని భారత సినీ రంగంలో అరుదైన నటుడని ఆయన అన్నారు.