: ముంబయ్ పోలీసుల ఆధ్వర్యంలో 'సోషల్ మీడియా ల్యాబ్'


నగరంలో శాంతి భద్రతలు పరిరక్షించే క్రమంలో భాగంగా ముంబయ్ పోలీసులు కొత్తరకం పంథా ఎంచుకున్నారు. ఇందు కోసం ఇంటర్నెట్ ఆధారిత సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. దేశంలోనే తొలిసారిగా 'సోషల్ మీడియా ల్యాబ్' ను శనివారం నాడు ముంబయ్ లో ప్రారంభించారు. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ చేతుల మీదుగా ఈ ల్యాబ్ ప్రారంభమైంది.

శాంతి భద్రతల విషయంలో ముంబయ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో, వీటి పరిరక్షణ విషయంలో ఎటువంటి పద్ధతులు అవలంభిస్తే బాగుంటుందో పౌరులు దీని ద్వారా సూచించవచ్చు. పోలీసులకు ప్రజలకు మధ్య ఇన్నాళ్ళూ వున్న అంతరం ఈ ల్యాబ్ వల్ల తొలగిపోతుందని ఈ సందర్భంగా ముంబయ్ నగర పోలీస్ కమీషనర్ సత్యపాల్ సింగ్ తెలిపారు.        

  • Loading...

More Telugu News