: సపోటాలతో వైన్ తయారీ.. మహారాష్ట్ర సర్కారు పరిశీలనలో


సపోటా పండ్లతో వైన్ తయారీకి అనుమతించాలన్న ప్రతిపాదనను మహారాష్ట్ర సర్కారు పరిశీలించనుంది. దీనివల్ల సపోట సాగు రైతులకు మరింత ఆదాయం సమకూరనుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి రాజేంద్ర గేవిట్ తెలిపారు. థానే జిల్లాలోని పాల్ గఢ్, దహను తాలూకా రైతుల నుంచి ఈ మేరకు డిమాండ్లు ఉన్నాయని చెప్పారు. ద్రాక్ష, మరికొన్ని రకాల పండ్లతో వైన్ తయారీకి అనుమతించినట్లే.. సపోటాల వినియోగానికీ అనుమతించే యోచన ఉందన్నారు.

  • Loading...

More Telugu News