: భారత్ విజయలక్ష్యం 272 పరుగులు


రెండో వన్డేలో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ భారత బౌలింగ్ ను చీల్చి చెండాడారు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 42 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ధోనీ టాస్ గెలిచినా ఫీల్డింగ్ ఎంచుకోవడం.. వర్షం కారణంగా మ్యాచుకు మధ్యలో అంతరాయం కలగడంతో 42 ఓవర్లకు కుదించారు. అయినా న్యూజిలాండ్ జట్టు బ్యాట్స్ మెన్ వీలైనన్ని పరుగులు పిండుకున్నారు. భారత బౌలర్లలో మొహమ్మద్ షమి ఒక్కడే మూడు వికెట్లను తీసుకున్నాడు. మిగతావారు పెద్దగా రాణించలేదు. విలియమ్స్ చెలరేగి 77 పరుగులు చేశాడు. టేలర్ 57, గుప్తిల్ 44, అండర్సన్ 44 పరుగులతో స్కోరు బోర్డు పెరగడంలో కీలక పాత్ర పోషించారు. భారత జట్టు ముందు భారీ విజయలక్ష్యం ఉంచారు.

  • Loading...

More Telugu News