: అక్కినేని భౌతిక కాయాన్ని సందర్శించిన చంద్రబాబు


నటసామ్రాట్ అక్కినేని భౌతిక కాయాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నపూర్ణ స్టూడియోస్ లో సందర్శించారు. ఆయన భౌతిక కాయం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, ఎన్టీఆర్, ఏఎన్నార్ లు కళామతల్లికి రెండు కళ్ళులాంటి వారన్నారు. తెలుగు సినిమా అంటే ఎన్టీఆర్, ఏఎన్నార్ అనేంతగా చరిత్ర సృష్టించారని అన్నారు. అక్కినేనితో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఏఎన్నార్ లో పాజిటివ్ దృక్పధం ఎక్కువగా ఉండేదని తెలిపారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News