: అక్కినేని భౌతిక కాయాన్ని సందర్శించిన పలువురు సినీ ప్రముఖులు
నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు భౌతిక కాయాన్ని పలువురు సినీ ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. ప్రముఖ నిర్మాత రామానాయుడు, దాసరి నారాయణరావు, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, రచయిత సి.నారాయణ రెడ్డి, రాఘవేంద్రరావు, మోహన్ బాబు, శ్రీకాంత్, జగపతిబాబు, సురేశ్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, రాజమౌళి, పరుచూరి వెంకటేశ్వరరావు, నందమూరి హరికృష్ణ, కల్యాణ్ రామ్, బ్రహ్మానందం, వీబీ రాజేంద్రప్రసాద్ తదితరులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అక్కినేని మృతి బాధాకరమని, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని రామానాయుడు తన సంతాపాన్ని తెలిపారు.