: ఢిల్లీలో మహిళలకు రక్షణ కరవైంది: కేజ్రీవాల్
ధర్నా విరమణ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ పోలీసులపై పలు ఆరోపణలు చేశారు. పోలీసుల వైఫల్యం వల్లే ఢిల్లీలో మహిళలకు రక్షణ కరవైందని అన్నారు. ప్రజల రక్షణకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని, అందుకే తమ చేతుల్లో లేని అంశం గురించి ఉద్యమించామని ఆయన తెలిపారు. ప్రజలకు ఢిల్లీ పోలీసులు జవాబుదారులుగా ఉండాలని తెలిపారు. కేంద్రం చేతిలో ఉన్నామన్న ధీమాతో ఢిల్లీ పోలీసుల్లో అలసత్వం వచ్చిందని మండిపడ్డారు. గణతంత్రదినోత్సవాల ఔన్నత్యంపై తమకు అపార గౌరవముందని అన్నారు. పోలీసులపై విజయం ఢిల్లీ ప్రజల విజయమని ఆయన అభివర్ణించారు.