: అనూహ్య పోస్టుమార్టం నివేదిక వెల్లడి


కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నం వాసి అనూహ్య ఎస్తేర్ హత్య కేసులో పోస్టుమార్టం నివేదిక వెల్లడి అయింది. ముంబైలో హత్యకు గురైన అనూహ్య.. ఉదయం వేళలో హత్యకు గురైనట్లు ఈ నివేదికలో వెల్లడైంది. ఆమె భౌతిక కాయంపై అనేక గాయాలున్నాయని కూడా నివేదిక స్పష్టం చేసింది. అయితే, ఆమెపై అత్యాచారం జరిగిందా? లేదా? అన్న విషయం రసాయనిక పరీక్షల అనంతరం నిర్థారిస్తామని డాక్టర్లు చెప్పారు.

ఈ కేసులో ముంబై కంజూర్ మార్గ్ పోలీసులు, ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరో వైపు కీలక సాక్ష్యాలు సేకరించారు. ఉదయం 4.50 గంటలకు లోక్ మాన్య తిలక్ టెర్మినస్ లో రైలు దిగిన అనూహ్య అక్కడి నుంచి తన నివాసానికి క్యాబ్ లో బయలుదేరిందని, మార్గమధ్యంలో.. అంటే సుమారు ఆరు గంటల సమయంలో అనూహ్య సెల్ ఫోన్ స్విచ్ఛాప్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె పార్థివ దేహం దొరికిన 300 మీటర్ల దూరంలో సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఈ హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో నిర్థారణకు వచ్చారు. రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ఈ కేసు విచారణను వేగవంతం చేయాలని ముంబై పోలీసులను సీఎం కిరణ్ కోరిన విషయం విదితమే. దీంతో ముంబై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

  • Loading...

More Telugu News