: బాలీవుడ్ వర్సెస్ టీమిండియా.. క్రికెట్ మ్యాచ్ కాదు!


త్వరలో బాలీవుడ్ నటులు, టీమిండియా క్రికెటర్లు కలిసి ఓ సాకర్ మ్యాచ్ ఆడనున్నారు. మాజిక్ బస్ అనే స్వచ్ఛంద సేవా సంస్థకు నిధుల సేకరణ నిమిత్తం ఈ సుహృద్భావ పోటీ నిర్వహిస్తున్నారు. 'ప్లేయింగ్ ఫర్ హ్యుమానిటీ' పేరిట నిర్వహిస్తోన్న ఈ ఫుట్ బాల్ మ్యాచ్ మార్చి 30న ఢిల్లీలో జరగనుంది.

కాగా, బాలీవుడ్ టీమ్ లో అభిషేక్ బచ్చన్, రణ్ ధీర్ కపూర్, అర్జున్ కపూర్ తదితరులు ఉన్నారు. ఇక టీమిండియా ఎలెవెన్ జట్టుకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తాడని తెలుస్తోంది. ఆ జట్టులో మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్ లు ఆడనున్నట్టు సమాచారం. 

  • Loading...

More Telugu News