: ప్రతివాడూ ప్రధాని కావాలనుకుంటున్నాడు: లాలూ


దేశంలో ప్రతి ఒక్కరూ ప్రధాని కావాలనుకుంటున్నారని కేజ్రీవాల్ పై ఆర్జీడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పరోక్ష విమర్శలు చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కేజ్రీవాల్ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నాడని అన్నారు. కేజ్రీవాల్ చేస్తున్న ధర్నా ఓ డ్రామా అని అభివర్ణించారు. ముఖ్యమంత్రే ధర్నా చేయడం విని దేశ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీనే లక్ష్యం చేసుకున్నారని, దాని కారణంగా మతతత్వశక్తులు బలపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేజ్రీవాల్ యువతను తప్పుదారి పట్టించకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News