: మంచుతో మనోహరంగా మారిన హిమాచల్ ప్రదేశ్


హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అంతటా హిమపాతం మనోహర దృశ్యాన్ని ఆవిష్కరిస్తోంది. సాయం సంధ్యా సమయంలో కురుస్తోన్న మంచుతో హిమాచల్ లోని రహదారులు, భవనాలు మూసుకుపోతున్నాయి. చెట్లు అయితే రాత్రి పూట మంచు దుప్పటి కప్పుకున్నట్టే కనపడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉన్న నదులు, సరస్సులు మంచుతో రాత్రి సమయాల్లో ఘనీభవిస్తున్నాయి. దీంతో.. ఈ మనోహర దృశ్యాలను వీక్షించేందుకు దేశం నలు మూలల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో హిమాచల్ ప్రదేశ్ కు చేరుకుంటున్నారు. హిమపాతాన్ని, హిమనీనదాలను చూసి ఉల్లాసంతో పరవశించిపోతున్నారు. పర్యాటకులు ప్రాంతాలను సందర్శించేందుకు వీలుగా గుర్రాలను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ పర్యాటకులకు వీలుగా పలు ప్యాకేజీలను సిద్ధం చేయడంతో దేశం నుంచే కాక.. విదేశాల నుంచి కూడా భారీగా సందర్శకులు వస్తున్నారు.

  • Loading...

More Telugu News