: జైళ్ల శాఖలో భారీ ప్రక్షాళన
రాష్ట్రంలోని కారాగారాలకు సంబంధించి ప్రభుత్వం భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని జైళ్లలో పనిచేస్తున్న 500 కు పైగా ఉన్న జైలు వార్డెన్లను సొంత జిల్లాలకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బదిలీలపై ఇంతకు ముందు ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. ఎంతో కాలంగా బదిలీల కోసం ప్రభుత్వానికి అభ్యర్థనలు పంపిన జైలు సిబ్బంది.. ఈ నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్నారు.