: మంత్రి వర్గం ముందుకు 12 సిలిండర్ల ప్రతిపాదన: మొయిలీ
రాయితీ సిలిండర్ల సంఖ్య 9 నుంచి 12కు పెంచాలన్న ప్రతిపాదన వచ్చే వారాంతానికి కేంద్ర మంత్రి వర్గం ముందుకు తీసుకువస్తామని కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ సూచన మేరకు సిలిండర్ల సంఖ్యను 9 నుంచి 12కు పెంచనున్నామని అన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏఐసీసీ సమావేశాల సందర్భంగా ప్రధానిని సిలిండర్ల సంఖ్య 9 నుంచి 12 కు పెంచాలని కోరిన సంగతి తెలిసిందే.