: కేజ్రీవాల్ ప్రభుత్వానికి ప్రణాళిక లేదు: అరుణ్ జైట్లీ
దేశ రాజధాని ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ధర్నా చేస్తుండటంపై బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ విమర్శలు చేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఒక ప్రణాళిక అంటూ ఏమి లేదన్నారు. అరాచకం సృష్టించేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న జైట్లీ... చట్టాలు, న్యాయ సూత్రాలను అనుసరిస్తూ ప్రభుత్వాన్ని నడపాలని హితవు పలికారు. కాగా, ఢిల్లీలో జరిగిన వివాదానికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు.