: హైదరాబాద్ పేలుళ్ల ఘటనలో అనుమానితుల గుర్తింపు


హైదరాబాద్ జంట పేలుళ్ల ఘటనలో ఇద్దరు అనుమానితులను పోలీసులు గుర్తించారు. ఓ దుకాణం వెలుపల ఉన్న సీసీ కెమెరాలో.. ఈ ఇద్దరు బాంబు పేలుడుకు పాల్పడినట్టు ఆధారాలు లభ్యమయ్యాయని రాష్ట్ర డీజీపీ దినేశ్ రెడ్డి తెలిపారు. 

వారిద్దరూ నిషిద్ధ ఇండియన్ ముజాహిదిన్ తీవ్రవాద సంస్థకు చెందిన తబ్రేజ్, వకాస్ అని అనుమానిస్తున్నట్టు ఆయన చెప్పారు. వారికోసం  ప్రస్తుతం దర్యాప్తు బృందాలు గాలిస్తున్నాయని వెల్లడించారు. అయితే, ఇప్పుడప్పుడే పేలుళ్ల ఘటనకు ఎవరినీ బాధ్యులుగా ప్రకటించబోమని ఆయన స్పష్టం చేశారు.

తబ్రేజ్, వకాస్ ల ఆచూకీ తెలుసుకునేందుకు.. పోలీసుల అదుపులో ఉన్న ఇండియన్ ముజాహిదిన్ తీవ్రవాదులు మక్బూల్, ఇమ్రాన్ లతో పాటు బెంగళూరు జైల్లో ఉన్న ఉబేద్ ఉర్ రహ్మాన్ ను విచారించనున్నట్టు డీజీపీ వెల్లడించారు. 

  • Loading...

More Telugu News