: ప్రియురాలి తండ్రి హత్య కేసులో బందరు యువకులు అరెస్ట్


ప్రేమ వ్యవహారంలో యువతి తండ్రిని హత్య చేయించిన కేసులో ఖమ్మం పోలీసులు మచిలీపట్నం (బందరు)లోని ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. బందరులోని ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న ఓ యువతిని వసీంబేగ్ ప్రేమించాడు. ఈ వ్యవహారాన్ని అంగీకరించని ఆమె కుటుంబం ఖమ్మం జిల్లా అశ్వాపురం వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహించిన వసీంబేగ్ తన స్నేహితులు అస్లీంబేగ్, ఎస్.ఎం.బేగ్ తో అశ్వాపురం వెళ్లి యువతి తండ్రి కొంచెన్ గౌడను గత ఏడాది ఆగస్టు నెలలో హత్య చేయించాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన ఖమ్మం జిల్లా పోలీసులు బందరు వచ్చి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు వసీంబేగ్ మాజీ కౌన్సిలర్ కుమారుడు కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News