: అసెంబ్లీ రేపటికి వాయిదా
ఇవాళ రాష్ట్ర శాసన సభలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై వాడివేడి చర్చ జరిగింది. రాష్ట్ర విభజన బిల్లుపై సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సభలో ఉదయం నుంచి కేటీఆర్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఆయన వ్యాఖ్యలకు పలువురు సభ్యులు మధ్యలో అభ్యంతరాలు తెలిపారు. బిల్లుపైనే చర్చించాలని బీజేపీ, వామపక్ష సభ్యులు సూచించారు. ఇవాళ సభ రెండుసార్లు వాయిదా పడినా.. సాయంత్రం వరకు చర్చ కొనసాగింది. సభను వాయిదా వేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రతిపాదించగా, మరో గంటసేపు కొనసాగించాలని నాగం జనార్థన్ రెడ్డి సభాపతిని కోరారు. ఈ క్రమంలో, సభ్యులు ఒక్కొక్కరు మూడు నుంచి అయిదు నిమిషాల సమయం మాత్రమే తీసుకుని, అభిప్రాయాలను వ్యక్తం చేయాలని ఉప సభాపతి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. అనంతరం సభను బుధవారం ఉదయం 9 గంటలకు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు.