: సల్మాన్ ఖాన్ సినిమాలు ఎవరూ చూడొద్దు : ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రశంసించడంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ షేక్ పేటలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, సల్మాన్ ఖాన్ గుజరాత్ వెళ్లి నరేంద్ర మోడీని కలిసి ముస్లింల మనోభావాలు దెబ్బతీశారని అన్నారు. అందుకే సల్మాన్ ఖాన్ సినిమాలను బహిష్కరించాలని, ఎవరూ చూడవద్దని ఆయన పిలుపునిచ్చారు.