: జంట పేలుళ్ల కేసులో పురోగతి సాధించాం: షిండే


హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో పురోగతి సాధించామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. ఆయన ఈరోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాద దాడులను ఎదుర్కోవడంలో కేంద్రం అప్రమత్తంగానే ఉందని, నిఘా వర్గాల ద్వారా రాష్ట్రాలను ఈ విషయంలో హెచ్చరిస్తూనే వచ్చామని ఆయన తెలిపారు. దాడులను ఎదుర్కోవడంలో ఎక్కడా వైఫల్యానికి తావివ్వలేదని షిండే  చెప్పారు. 

  • Loading...

More Telugu News