: ఛలో హైదరాబాద్ కు అనుమతి లేదు: డీజీపీ
ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చిన ఛలో హైదరాబాద్ కు అనుమతి లేదని డీజీపీ ప్రసాదరావు స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సర్వసన్నద్దులై ఉన్నారని అన్నారు. రాజధాని నగరంలో సభలు సమావేశాలకు అనుమతి ఇవ్వడంలేదని ఆయన స్పష్టం చేశారు.