: బిల్లుపైనే చర్చిస్తే బాగుంటుంది: లక్ష్మీనారాయణ
శాసనసభలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ కొనసాగుతోంది. బిల్లులోని అంశాల పైనే చర్చిస్తే బాగుంటుందని భారతీయ జనతాపార్టీ సభ్యుడు వై.లక్ష్మీనారాయణ సభ్యులకు సూచించారు. బిల్లుపై చర్చ పక్కదారి పట్టకుండా మాట్లాడాలని సీపీఎం సభ్యుడు జూలకంటి సూచన చేశారు. శాసనసభలో ఎవరి వాదన వారిదేనని సీపీఐ సభ్యుడు గుండా మల్లేష్ అన్నారు. మట్టిబొమ్మలన్న వ్యాఖ్యలకు చింతిస్తున్నామని సభ్యులు చెబితే సరిపోతుందని ఆయన అన్నారు. కాగా, సభ సమయాన్ని పెంచేందుకు ఉన్న అవకాశాన్ని స్పీకర్ పరిశీలించాలని, సభ్యులందరూ మాట్లాడేందుకు వీలుగా సభ సమయాన్ని పెంచాలని మంత్రి శైలజానాథ్ కోరారు.