: శ్రీనగర్ లో బంద్ కు పిలుపునిచ్చిన వేర్పాటువాదులు


జమ్మూకాశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్ లో వేర్పాటువాదులు బంద్ కు పిలుపునిచ్చారు. దాంతో, నగరంలోని లాల్ చౌక్, పరిసర ప్రాంతాల్లో ప్రజల సాధారణ జీవనంపై తీవ్ర ప్రభావం పడింది. లాల్ చౌక్, మైసుమా, గా కాదల్, హరి సింగ్ హై స్ట్రీట్, మహారాజా బజార్ ప్రాంతాల్లో దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసివేశారు. 1990లో ఇదే రోజున ధర్నా చేస్తున్న 51 మందిని భద్రతా దళాలు కాల్చి చంపినందుకు వేర్పాటువాదులు బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు, పారామిలిటరీ దళాలు నగరంలో భద్రత చేపట్టారు.

  • Loading...

More Telugu News