: రెండు గ్రామాల మధ్య వివాదం రేపిన నాగదేవత!


సాంకేతిక పరిజ్ఞానంతో పాటు.. మూఢనమ్మకాలు కూడా వేగంగానే వ్యాప్తి చెందుతున్నాయి. తనకు నాగదేవత ఆవహించిందని ప్రకటించుకున్న ఓ బాలిక చెప్పిన మాటలు రెండు గిరిజన గ్రామాల మధ్య వివాదాన్ని రేపాయి. విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలోని పెదదొడ్డకు చెందిన గీత, తనకు నాగదేవత ఆవహించిందని చెప్పి విద్యకు స్వస్తి పలికింది. ఆమె మాటను గ్రామస్థులు నమ్మడంతో గత నెల రోజులుగా ఆమెకు పూజలు చేస్తున్నారు.

వారం రోజుల్లో గ్రామంలో నాగదేవత పుడుతుందని సెలవిచ్చింది గీత. అలాంటిదేం జరగకపోవడంతో కురుపాం మండలంలోని గొటివాడ (లోమడ) గ్రామంలోని నాగదేవత విగ్రహాన్ని తెచ్చి తమ గ్రామంలో ప్రతిష్టిం ప్రతిష్ఠించాలని, లేని పక్షంలో తాను శిలగా మారిపోతానని చెప్పింది. దీంతో గ్రామస్థులు ఈ నెల 16న అర్థరాత్రి గొటివాడ గ్రామానికి వెళ్లి నాగదేవత విగ్రహాన్ని తవ్వ తమ గ్రామానికి తీసుకెళ్లారు. దీనిపై గొటివాడ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి రక్షగా ఉన్న నాగదేవత విగ్రహాన్ని యథాస్థానంలో ఉంచకపోతే అరిష్టం జరుగుతుందని, తక్షణం ఆ విగ్రహాన్ని తిరిగి తీసుకురావాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News