: ఆటో సంఘాలను చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం
ఆటో సంఘాలను సమ్మె విరమింపజేసేందుకు రవాణా శాఖ ముమ్మర ప్రయత్నాల్లో భాగంగా చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాదులోని ఖైరాతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఆటో సంఘాల నేతలతో రవాణాశాఖ కమిషనర్ చర్చలు జరపనున్నారు. నాలుగు రోజుల నుంచి ఆటో సంఘాలు సమ్మె చేస్తుండటంతో నగరంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.