: ఆ సమయంలో కేసీఆర్ ఎక్కడున్నారో గుర్తుచేసుకోండి: పయ్యావుల


ఈ రోజు శాసనసభ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. టీఆర్ఎస్ పై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రం రెండుగా చీలిపోయిన సందర్భంలో సగం మంది సంతోషంగా, సగం మంది బాధతో ఉన్నారని... ఇలాంటి సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ నుంచి అధికార మార్పిడి జరిగే సమయంలో కేసీఆర్ కూడా తమతో పాటే ఉన్నారని... ఈ విషయాన్ని టీఆర్ఎస్ గుర్తు చేసుకోవాలని అన్నారు. కేటీఆర్ మాటల్లో అహంకార ధోరణి కనిపిస్తోందని పయ్యావుల ఆరోపించారు.

  • Loading...

More Telugu News