: కేటీఆర్ ప్రసంగంపై శాసనసభలో టీడీపీ ఆందోళన
టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రసంగంపై శాసనసభలో ఇంకా ఆందోళన కొనసాగుతోంది. ట్యాంక్ బండ్ పై విగ్రహాల గురించి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేసినా... కేటీఆర్ చెప్పకపోవడంతో స్పీకర్ పోడియం వద్ద సీమాంధ్ర టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. దాంతో, అటు సభ సరైన ఆర్డర్ లో లేకపోవడంతో చర్చకు ఆటంకం ఏర్పడుతోంది. దీనిపై టీడీపీ తరపున పయ్యావుల మాట్లాడుతూ.. కేటీఆర్ పదే పదే రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.