: మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఎమ్మెల్యే


అత్యాచారాల జాఢ్యం ప్రజాప్రతినిధులకు కూడా పాకింది. నిర్భయ చట్టంపై ఏ మాత్రం గౌరవం లేని ఎమ్మెల్యే... ఉద్యోగం కోసం తనను ఆశ్రయించిన మహిళపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే, ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలోని ఉదాల పట్టణంలో తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ బిజూ జనతాదళ్ ఎమ్మెల్యే శ్రీనాథ్ సోరేన్ ను ఆశ్రయించింది. ఆయన ఉద్యోగహామీ ఇవ్వడంతో.. లక్ష రూపాయల నగదు కూడా చెల్లించింది. అయితే ఉద్యోగం కోసం ఎన్నిసార్లు అభ్యర్థించినా నిరాశే ఎదురవ్వడంతో తన డబ్బు తనకు చెల్లించాలని డిమాండ్ చేసింది.

దాంతో జనవరి 3న ఓ చోటికి వస్తే డబ్బు ఇచ్చేస్తానని నమ్మబలికాడు. డబ్బుకోసం వెళ్లిన మహిళను ఎమ్మెల్యే శ్రీనాథ్ సోరేన్, అతని సహాయకుడితో కలసి అత్యాచారం చేశాడు. దీనిపై కేసు నమోదు చేయాలని ఆమె పోలీసులను అభ్యర్థించింది. వారు స్పందించకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మహిళ ఆరోపణలు ప్రతిపక్షాల కుట్ర అని, తన ప్రతిష్ఠను మంట గలిపేందుకు ఆడుతున్న నాటకమని అన్నారు. వైద్య పరీక్షల కోసం మహిళను ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News