: కొత్త పార్టీ పెడితే భంగపాటే: బొత్స
సమైక్య ఉద్యమం ముసుగులో కొత్త పార్టీ పెడితే భంగపాటు తప్పదని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, 'కొత్త పార్టీ అంటే 294 నియోజకవర్గాల్లో హోర్డింగులు పెట్టాలి కదా? అలా జరగలేదంటే అవి ప్రకటనలేనని తాను అనుకుంటున్నట్టు' ఆయన అన్నారు. రాజ్యసభ సీట్లపై పలు విన్నపాలు వస్తున్నాయని, వాటిని అధిష్ఠానానికి విన్నవిస్తామని తెలిపారు. రాజ్యసభ అభ్యర్థుల ఖరారు కోసం సీఎంతో కలసి ఢిల్లీ వెళ్తున్నానని ఆయన తెలిపారు.