: నాలుగు మట్టిబొమ్మలు కూలిపోతే అపచారం అన్నట్టు మాట్లాడుతున్నారు: కేటీఆర్


ట్యాంక్ బండ్ పై నాలుగు మట్టి బొమ్మలు కూలిపోతే అదేదో అపచారం అన్నట్టు సీమాంధ్ర నేతలు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నేత కేటీఆర్ విమర్శించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఒక్కటై, ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తుంటే, అది పట్టించుకోవడం మానేసి మట్టిబొమ్మల కోసం గొడవ చేస్తున్నారని అన్నారు. దీనిపై సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.

సీమాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో డిప్యూటీ స్పీకర్ కేటీఆర్ ను సరిచేసుకోవాలని సూచించారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ, తాను తన మాటకే కట్టుబడి ఉన్నానని, ట్యాంక్ బండ్ పై ఉన్నవన్నీ మట్టి ముద్దలేనని అన్నారు. దీంతో మరోసారి తీవ్ర గందరగోళం నెలకొంది. వెంటనే డిప్యుటీ స్పీకర్ సభను ఐదు నిమిషాలు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News