: మహానుభావుల విగ్రహాలను మట్టిబొమ్మలంటారా?: ధూళిపాళ్ల
విభజన ముసాయిదా బిల్లుపై శాసనసభలో చర్చ సందర్భంగా ట్యాంక్ బండ్ పై విగ్రహాలను మట్టిబొమ్మలంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహానుభావుల విగ్రహాలను ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ఏర్పాటు చేస్తే.. ఈనాడు కేటీఆర్ మట్టిబొమ్మలంటారా? అని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర సూటిగా నిలదీశారు. ఇలాంటి మాటలు మాట్లాడటానికి సిగ్గులేదా? అని మండిపడ్డారు. అటు కాంగ్రెస్ సభ్యురాలు వంగా గీత కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆనాడు నందమూరి తారకరామారావుగారు ఆ విగ్రహాలు ఏర్పాటుచేస్తే.. ఈనాటి టీఆర్ఎస్ తారకరామారావు వాటిని మట్టిబొమ్మలన్నందుకు క్షమాపణ చెప్పాలని గట్టిగా ప్రశ్నించారు. అనంతరం కూడా సభలో గందరగోళం నెలకొనడం, చర్చ కొనసాగేందుకు అనుకూలంగా లేకపోవడంతో డిప్యూటీ స్పీకర్ సభను ఐదు నిమిషాల పాటు వాయిదా వేశారు.