: కేజ్రీవాల్ కు చట్టాలంటే గౌరవం లేదు: డిగ్గీ రాజా


ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చట్టాలను గౌరవించరని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ కేజ్రీవాల్ ఐఆర్ఎస్ అధికారిగా ఉన్నప్పుడు కూడా చట్టాలను లెక్కచేయలేదని అన్నారు. లోక్ పాల్ బిల్లుపై ఉద్యమం సందర్భంగా సామాజికవేత్త అన్నాహజారే పేరిట డబ్బు వసూలు చేశారని ఆయన ఆరోపించారు. వసూలు చేసిన డబ్బును కేజ్రీ ఎక్కడ దాచారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News