: కేటీఆర్ ఆత్మశుద్ధితో మాట్లాడాలి: శైలజానాథ్
టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రసంగంపై మంత్రి శైలజానాథ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటీఆర్ ఆత్మశుద్ధితో మాట్లాడాలన్నారు. 'బూర్గుల రామకృష్ణారావుకు, సీఎం కిరణ్ కు ఉన్న తేడానే తెలంగాణకు, సీమాంధ్రకు ఉన్న తేడా' అని కేటీఆర్ అన్న వ్యాఖ్యలను ఖండించిన శైలజానాథ్.. ఆనాడు విశాలాంధ్రకు అనుకూలమని తీర్మానం పెట్టింది బూర్గుల రామకృష్ణారావేనని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో 40కి పైగా కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట, లేనప్పుడు ఒకమాట మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ పై మాట్లాడే హక్కు కేటీఆర్ కు లేదని స్పష్టం చేశారు. అటు సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో సహనం వహించాలని సూచించారు.