: సీతారామాంజనేయులు ఖాకీ క్రూరమృగం: న్యాయవాది చిరంజీవి
గ్రేహౌండ్స్ ఐజీ సీతారామాంజనేయులు ఖాకీ డ్రెస్ వేసుకుని, 26 ఎన్ కౌంటర్లు చేసిన క్రూరమృగం అని వల్లభనేని వంశీ తరపు న్యాయవాది చిరంజీవి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ సీతారామాంజనేయులు చేసిన బూటకపు ఎన్ కౌంటర్లపై చర్యలు తీసుకోవాలని గతంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. విజయవాడ సీపీగా ఉండగా మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించారన్నది అందరికీ తెలిసిందేనని ఆయన గుర్తు చేశారు.