: నేడు శ్రీమతిగా మారనున్న సమీరారెడ్డి
తెలుగు సినీ అభిమానులకు పరిచయమున్న నటి సమీరారెడ్డి వివాహం నేడు ముంబైలో జరగనుంది. వ్యాపారవేత్త అక్షయ్ వార్దే(31)ను ఆమె పెళ్లాడనుంది. గత రెండున్నరేళ్లుగా వీరు సహజీవనం సాగిస్తున్నారు. ఉంగరాలు కూడా మార్చుకున్నారు. నేటి సాయంత్రం బాంద్రాలో వివాహ వేడుక ఉంటుందని, కేవలం కొద్ది మంది సన్నిహితులు, బంధువులు మాత్రమే దీనికి హాజరు కానున్నారని నటి సన్నిహిత వర్గాలు తెలిపాయి. వివాహం విషయాన్ని సమీరా తల్లి నక్షత్రారెడ్డి కూడా ధ్రువీకరించారు. సమీరారెడ్డి రాజమండ్రిలో జన్మించినా ఆమె విద్యాభ్యాసం అంతా ముంబైలో జరిగింది. జై చిరంజీవ, అశోక్, కృష్ణం వందే జగద్గురుం తదితర తెలుగు చిత్రాలతోపాటు, తమిళ, మలయాళ, బెంగాలీ, హిందీ చిత్రాల్లోనూ నటించింది.