: కేజ్రీవాల్ సామాన్యుడిలా కాకుండా సీఎంలా వ్యవహరించాలి: సోలీ సోరాబ్జీ
ఢిల్లీలో కేజ్రీవాల్ దీక్షపై మాజీ అటార్నీ జనరల్ సోలీ సోరాబ్జీ స్పందించారు. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కేజ్రీవాల్ చట్టానికి అతీతంగా వ్యవహరించలేరని చెప్పారు. చట్టం కన్నా ఎవరూ గొప్ప వారు కారనే విషయాన్ని కేజ్రీ గుర్తించాలని అన్నారు. ఆయన సాధారణ పౌరుడిగా కాకుండా, ముఖ్యమంత్రి స్థాయిలో హుందాగా ప్రవర్తించాలని సూచించారు.