: బీహార్, జార్ఖండ్ లలో బీజేపీకే ఎక్కువ స్థానాలు


లోక్ సభ ఎన్నికల్లో బీహార్ లో నితీశ్ కుమార్ కు బ్రేక్ పడనుంది. బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి మోడీతో విభేదించి.. జేడీయూ ఎన్డీయే నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలు లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకే పట్టంకట్టనున్నట్లు లోక్ నీతి, ఐబీఎన్ నిర్వహించిన సర్వేలో తేలింది. పక్కనున్న జార్ఖండ్ లోనూ బీజేపీ హవానే నడవనుంది. బీహార్ లో మొత్తం 40 లోక్ సభ స్థానాలకు గాను బీజేపీ 16 నుంచి 24 స్థానాలను గెలుచుకోవచ్చని వెల్లడైంది. జేడీయూ 7 నుంచి 13 స్థానాలకే పరిమితం కావచ్చని, ఆర్జేడీ 6 స్థానాలు గెలుచుకోవచ్చని సర్వే పేర్కొంది.

పశ్చిమబెంగాల్లో 42 లోక్ సభ స్థానాలకు గాను తృణమూల్ కాంగ్రెస్ 20 నుంచి 28 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉండగా.. వామపక్షాలు 7 నుంచి 13 స్థానాలు, కాంగ్రెస్ 5 నుంచి 9 స్థానాలు సొంతం చేసుకోవచ్చని సర్వేలో స్పష్టమైంది. ఒడిశాలో మొత్తం 21 లోక్ సభ స్థానాలకు గాను నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలోని బీజేడీ 10 నుంచి 16 స్థానాలను గెలుచుకోనుంది. కాంగ్రెస్ 3 నుంచి 9 వరకు, బీజేపీ 4 వరకు సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని వెల్లడైంది. అసోంలో 2009 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ 35 శాతం ఓట్లను సాధిస్తే ఈసారి 47 శాతానికి పెరగనుందని వెల్లడైంది.

  • Loading...

More Telugu News