: తెలంగాణ ఏర్పడితే టీడీపీ, బీజేపీలు సంయుక్తంగా బలపడతాయి: అక్బరుద్దీన్


తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే టీడీపీ, బీజేపీలు సంయుక్తంగా బలపడతాయని... హిందుత్వ శక్తులను బలపరిచేందుకే బీజేపీ పొత్తులు పెట్టుకుంటోందని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. తెలంగాణలోని మైనార్టీల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. శాసనసభలో ప్రసంగిస్తూ అక్బరుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు. నాటి రాష్ట్ర విలీనం వల్ల వేలాది మంది ముస్లింలు ఉద్యోగాలను కోల్పోయారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంలో ముస్లింల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలకంటే ముస్లింలే ఎక్కువగా ఉన్నారని... కొత్త రాష్ట్రంలో మైనార్టీ కమిషన్ లు, కార్పొరేషన్లు కొనసాగించాలని కోరారు. కొత్త రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు కొనసాగించాలని అన్నారు. రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలని తాము జీవోఎంను కోరామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News