: నేనే సీఎంను.. నా ఇష్టం..: కేజ్రీవాల్
పాపం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఆవేదన పొంగుకొచ్చింది. దేశ రాజధానిలో శాంతి భద్రతల అధికారాలు కేంద్రం చేతిలో ఉండడం.. ముఖ్యమంత్రి అయినా చేతులు ముడుచుకుని కూర్చోవాల్సిన పరిస్థితితో కేజ్రీవాల్ కు దిక్కుతోచడం లేదు. అందుకే తమకు సహకరించని పోలీసు అధికారులను తొలగించాలంటూ ఆయన సహచర మంత్రులతో కలసి నిరసన దీక్షకు దిగారు. కేంద్ర హోం మంత్రి షిండే కార్యాలయం ముందు దీక్ష చేయాలని తొలుత నిర్ణయించగా.. పోలీసులు అడ్డుకోవడంతో మెట్రో స్టేషన్ ముందు ఆయన దీక్ష చేపట్టారు. అక్కడి నుంచి జంతర్ మంతర్ వద్దకు తరలిపోవాలని కోరడంతో.. కేజ్రీవాల్ మండిపడ్డారు. తాను ఢిల్లీ ముఖ్యమంత్రిని అని.. ఢిల్లీలో ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దీక్షకు దిగుతానని చెప్పారు. తన దీక్షాస్థలిని నిర్ణయించడానికి షిండే ఎవరని ప్రశ్నించారు.