: 'కవిత కుమార్తె..' ఉదంతంలో పెళ్ళికొడుకు అరెస్టు
సినీ నటి, తెలుగుదేశం మహిళానేత కవిత కుమార్తె మాధురిని వివాహం చేసుకున్న అల్కపల్లి రాజును పోలీసులు అరెస్టు చేశారు. రాజు స్వస్థలం హుజూరాబాద్. రాజుకు గతంలో రెండు వివాహాలు జరిగాయి. రెండో భార్య జయశ్రీ ఫిర్యాదు మేరకు రాజును అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు అతడిని రిమాండ్ కు తరలించారు.
రాజు 2005లో అన్నపూర్ణ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. అనంతరం ఆమె నుంచి విడిపోయి 2008లో జయశ్రీని పెళ్లి చేసుకున్నాడు. రెండు పెళ్ళిళ్ళు అయిన విషయాన్ని దాచిన రాజు తాజాగా కవిత కుమార్తె మాధురితో ప్రేమాయణం నడిపాడు.