: ఉపాధ్యాయుడి అఘాయిత్యం.. గర్భవతైన విద్యార్థిని
కనురెప్పే కంటిని కాటేసినట్లు.. ఉత్తమ బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే విలువలను మరిచి విద్యార్థినిని గర్భవతిని చేశాడు. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం నూతిరామన్న పాలెం గిరిజన సంక్షేమ హాస్టల్లో ఈ ఘోరం జరిగింది. ఒక ఉపాధ్యాయుడు మాయమాటలతో పదో తరగతి చదువుతున్న విద్యార్థినితో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు ఆలస్యంగా వెలుగుచూసింది. ఆమెకిప్పుడు ఏడు నెలల గర్భం. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు. గ్రామస్థులే పంచాయతీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయుడికి వివాహమై పిల్లలు కూడా ఉన్నారు.