: తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న షిండే
కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతి బయలుదేరి వెళ్లారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీ నుంచి రేణిగుంట వచ్చి, అటు నుంచి నేరుగా తిరుచానూరుకు షిండే చేరుకున్నారు. ఈ రాత్రికి ఆయన తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు. రేపు ఉదయం విజయవాడ వెళ్లనున్నారు.