: ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించనున్న ‘ఇందిరా రథయాత్ర’
రాజ్యసభ సభ్యుడు, ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు చేపట్టిన రెండవ విడత ‘ఇందిరా రథయాత్ర’ మంగళవారం నాడు ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం నాలుగు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిన సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపేందుకే ఈ యాత్రను వీహెచ్ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేయదని ప్రజలకు ఈ యాత్ర ద్వారా తెలియజేయనున్నామని ఆయన వెల్లడించారు. ఈ యాత్ర జిల్లాలోని నిర్మల్, బోథ్, ఆదిలాబాద్, ఖానాపూర్, ఆసిఫాబాద్, కాగజ్ నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల మీదుగా సాగుతుందని రామచంద్రారెడ్డి వివరించారు.