: శ్రమిస్తేనే.. లక్ష్యాన్ని చేరుకోగలం: పి.టి.ఉష
భారత్ అథ్లెట్, ‘పరుగుల రాణి’ పి.టి.ఉష ఇవాళ (సోమవారం) హైదరాబాదులో సందడి చేసింది. మియాపూర్ లో ఏర్పాటు చేసిన స్కాట్స్ డెల్ అథ్లెటిక్ అకాడమీని ఆమె ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవం అనంతరం ఉష మీడియాతో మాట్లాడింది. భారత్ లో ప్రతిభకు కొదవ లేదని, క్రీడాకారులకు దిశానిర్దేశం చేస్తే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని ఆమె తెలిపారు. పాఠశాల స్థాయి నుంచే ఆటల్లో విద్యార్థులను ప్రోత్సహించాలని, అందుకు తగిన సౌకర్యాలను ప్రభుత్వం కల్పించాలని ఆమె అభిలషించారు. కోచ్ లు ఇచ్చే సలహాలు, సూచనలను పాటించి, శ్రమిస్తే తప్పకుండా క్రీడాకారులు లక్ష్యాలను చేరుకుంటారని ఉష పేర్కొన్నారు.