: మహిళల భద్రత కోసమే ధర్నా చేస్తున్నాం: కేజ్రీవాల్
ఢిల్లీలో మహిళల భద్రత కోసమే తాము ధర్నా చేస్తున్నామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సరైన గుణపాఠం చెబుతామని అన్నారు. ధర్నా సమయంలో ఏం జరిగినా కేంద్రానిదే బాధ్యతని చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీలోని రైల్వే భవన్ వద్ద మద్దతు దారులతో కేజ్రీవాల్ ధర్నా కొనసాగుతోంది. మరో పది రోజుల పాటు అక్కడే ధర్నా చేయాలని కేజ్రీవాల్ యోచిస్తున్నట్లు సమాచారం.