: హైదరాబాదు అభివృద్ధి వివరాల కోసం శ్రీకృష్ణ కమిటీ నివేదికను చూడండి: ధూళిపాళ్ల
నిజాం పాలనపై శాసనసభ సభ్యులకు అక్బరుద్దీన్ సుదీర్ఘ వివరణ ఇచ్చిన అనంతరం టీడీపీ సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర సభలో మాట్లాడారు. ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలకు నిజాంపై ప్రేమ ఉంటే తమకు అభ్యంతరం లేదని ధూళిపాళ్ల అన్నారు. అయితే, నిజాం గొప్పతనాన్ని గురించి సభలో ప్రశంసించాల్సిన అవసరం ఏమిటని ఆయన సభ్యులను అడిగారు. ఆంధ్ర ప్రాంతాన్ని బ్రిటీష్ వాళ్లు అభివృద్ధి చేశారని, మరి వారిని పొగడమంటారా..? అని ఆయన సభ్యులను ప్రశ్నించారు. హైదరాబాదు అభివృద్ధి గురించి టీడీపీ చెప్పడం కాదు.. శ్రీకృష్ణ కమిటీ నివేదికలోనే ఈ విషయాన్ని వెల్లడించారని ఆయన సభ్యులకు తెలిపారు. దీనికి సంబంధించి నివేదిక కాపీలను కూడా ఆయన సభ్యులకు చూపించారు.