: నిజాం కాలంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందింది: అక్బరుద్దీన్ ఒవైసీ
నిజాముల కాలంలోనే హైదరాబాద్ పూర్తిగా అభివృద్ధి చెందిందని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, దేశంలోనే నిజాముల పాలనకు ఓ ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. దేశంలోనే మొదటి సిమెంటు రోడ్లు రూపుదిద్దుకున్నది నిజాముల హయాంలోనేనని ఆయన తెలిపారు. దేశంలో మొదటి విమానాశ్రయం నెలకొల్పింది నిజాములేనని అన్నారు. హైదరాబాద్ ను ఎవరూ అభివృద్ధి చేయలేదని, హైదరాబాద్ అభివృద్ధి చెందింది కాబట్టే ఇక్కడికి వచ్చారని ఒవైసీ అన్నారు. విద్య, ఉపాధి, వాణిజ్యం అన్ని రంగాల్లోనూ నిజాములు హైదరాబాద్ ను ఉన్నత స్థానంలో నిలబెట్టారని ఆయన కొనియాడారు.